వేడి నీటిలో పడి చిన్నారి తీవ్రంగా గాయాలు

326చూసినవారు
వేడి నీటిలో పడి చిన్నారి తీవ్రంగా గాయాలు
గూడెంకొత్తవీధి మండలం కొత్తబంధ గ్రామంలో గురువారం సాయంత్రం ఒక రైతు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కొర్ర నూకరాజు, కృపారాణి దంపతుల సంవత్సరం ఆరు నెలల కుమారుడు వేడి నీటిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. వ్యవసాయ పనుల నుంచి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు స్నానానికి వేడి నీళ్లు బకెట్‌లో పెట్టగా, ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. దీంతో బాలుడి ముఖం, చేతులకు తీవ్ర కాలిన గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్