గురువారం మధ్యాహ్నం చింతపల్లి నుంచి లంబసింగి వెళ్లే జాతీయ రహదారిపై లోతుగెడ్డ జంక్షన్ వద్ద పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. పాడేరు నుంచి చింతపల్లి వస్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.