మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు–భద్రాచలం రాష్ట్ర రహదారిని తాత్కాలికంగా మూసివేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి వాహనాలను కూనవరం మార్గం ద్వారా మళ్లిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రహదారి మూసివేత కొనసాగుతుందని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు.