
ఏడాదిన్నర కుమార్తెను కిడ్నాప్ చేసిన తండ్రి.. వీడియో వైరల్
రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఏడాదిన్నర వయస్సున్న కుమార్తెను ఆమె తండ్రే కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. భర్త వేధింపులు భరించలేక పుట్టింట్లో ఉంటున్న భార్య వద్ద ఉన్న చిన్నారిని, అక్టోబర్ 9న మధ్యాహ్నం తండ్రి అపహరించాడు. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భర్తపై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి, తండ్రి కోసం గాలిస్తున్నారు. చిన్నారిని క్షేమంగా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




