కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ డేకురాయి గ్రామంలో ఎనిమిది రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సమస్యపై శనివారం లోకల్ న్యూస్ లో కథనం ప్రచురితమవడంతో విద్యుత్ శాఖ మండల జేఈ నాగ సతీష్ స్పందించారు. దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేసి, శనివారం రాత్రి 10 గంటలకు బిగించారు. దీంతో గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడింది.