ఫైల్స్‌ను కలెక్టరేట్‌కు తీసుకుని రావాలి: జేసీ

617చూసినవారు
ఫైల్స్‌ను కలెక్టరేట్‌కు తీసుకుని రావాలి: జేసీ
ఐవీఆర్ఎస్ కాల్స్‌లో ఏ మండలంలో ఎక్కువ నెగటివ్ వస్తుందో, ఆ మండల తహశీల్దార్లు రెండు రోజుల్లో కలెక్టరేట్‌కు ఫైల్స్ తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశించారు. జిల్లాలో 1,400 గ్రామాల్లో రీ సర్వేకు సంబంధించిన మ్యూటేషన్ ఫైళ్లను జాగ్రత్తగా ఉంచాలని సూచించారు. జనన, మరణ ధ్రువపత్రాలు ఎక్కువ కాలం పెండింగ్‌లో లేకుండా నిర్ణీత గడువులోగా అందించాలని తహశీల్దార్లకు సూచించారు.