అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన నలుగురు మావోయిస్టులు మంగళవారం పాడేరులో స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరిలో మడవి కోస, నంద, సంగీత, మడియం లక్కు ఉన్నారు. వీరంతా ఏసీఎం క్యాడర్‌కు చెందినవారని, గతంలో పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని ఎస్పీ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంతో మావోయిస్టులు లొంగిపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.