జీ.మాడుగుల సీఐ స్ట్రాంగ్ వార్నింగ్

255చూసినవారు
జీ.మాడుగుల సీఐ స్ట్రాంగ్ వార్నింగ్
దీపావళి పండుగ నేపథ్యంలో, మందుగుండు సామగ్రి విక్రయాలపై ముందస్తు చర్యలు చేపట్టనున్నట్లు జీ.మాడుగుల సీఐ బీ. శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ బాణాసంచా తయారీ, నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. విక్రయదారులు తప్పనిసరిగా స్థానిక పోలీసుల అనుమతులు పొందాలని, ప్రజా రక్షణ దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.