అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీలో స్థానిక ఉప సర్పంచ్ గాలి నరసింహమూర్తి (నరేంద్ర) మరియు పంచాయతీ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు దుంబరి కృష్ణ అధ్యక్షతన "జీఎస్టీ, సూపర్ సేవింగ్స్" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల ఎంపీడీఓ కె. ప్రభాకరావు, కిరాణా షాపులు, టీ టిఫిన్ షాపులు, సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వల్ల అన్ని వస్తువుల ధరలు తగ్గినట్లు తెలిపారు. షాపుల యజమానులు ఈ విషయాన్ని వినియోగదారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇంచార్జి కార్యదర్శి పి. ధర్మారావు, పిసా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పల్లి దొర బాబు, సొంటేరి రాము, వార్డు సభ్యులు గాలి లక్ష్మి, గుద్దెల కృష్ణమూర్తి, ఎన్.ఆర్.జీ.ఎస్. సిబ్బంది, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.