అల్లూరి: తప్పిపోయిన మైనర్ బాలికలను పట్టుకున్న పోలీసులు

497చూసినవారు
అల్లూరి: తప్పిపోయిన మైనర్ బాలికలను పట్టుకున్న పోలీసులు
చింతపల్లి మండలం రింతాడ జి‌టిడబ్ల్యూ హోస్టల్‌ స్కూల్‌ నుంచి అక్టోబర్‌ 30న తప్పిపోయిన ముగ్గురు మైనర్‌ బాలికలను పోలీసులు సురక్షితంగా గుర్తించారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో, ఏ ఎస్ పి చింతపల్లి సూచనల మేరకు పోలీసులు తక్షణమే స్పందించి బాలికలను గుర్తించి హోస్టల్‌ వార్డెన్‌కు అప్పగించారు. ఫిర్యాదు అందిన కొద్ది గంటల్లోనే బాలికలను సురక్షితంగా రికవరీ చేసిన పోలీసుల చర్యలు ప్రశంసలు అందుకున్నాయి.