అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం నిట్టమామిడిపాలెం గ్రామ పరిధిలో సోమవారం ఉదయం అరుదైన గద్ద కనిపించింది. పంటపొలాల్లో అలసటతో పడిపోయిన ఈ పక్షిని గిరిజనులు గమనించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ వచ్చి అలసిపోయి ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ‘స్పిలోరిన్ షీలా’గా పిలువబడే ఈ శికరశ్రేణి గద్ద సాధారణంగా అండమాన్ నికోబార్ దీవులు వంటి ఎత్తైన అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుందని అటవీశాఖ చింతపల్లి డీఎఫ్‌వో నరసింహారావు తెలిపారు.