గర్భిణిని ఆసుపత్రికి తరలించిన ఎస్సై శంకరరావు

251చూసినవారు
గర్భిణిని ఆసుపత్రికి తరలించిన ఎస్సై శంకరరావు
కొయ్యూరు మండలం లోయలపాలెంకు చెందిన డిప్పల సంధ్య అనే గర్భిణికి నెలలు నిండాయి. ప్రసవం కోసం ఆమెను శుక్రవారం రాజేంద్రపాలెం PHCకి తరలించేందుకు వైద్య సిబ్బంది ప్రయత్నించారు. అయితే, గర్భిణి ఆసుపత్రికి వెళ్ళడానికి నిరాకరించడంతో, వైద్య సిబ్బంది మంప ఎస్సై కే.శంకరరావుకు సమాచారం అందించారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని, గర్భిణికి నచ్చచెప్పి, సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్