గోవధ చేస్తే కఠిన చర్యలు

585చూసినవారు
గోవధ చేస్తే కఠిన చర్యలు
గోవధ నిషేధం, సంరక్షణ చట్టం కఠినంగా అమల్లో ఉన్నాయని కొయ్యూరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజేష్‌కుమార్ గురువారం తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, మూడు సంవత్సరాల లోపు పెయ్యలను వధించడం పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి వధించిన వారిపై క్రూరత్వ నివారణ చట్టం-1962, గోవధ నిషేధం, సంరక్షణ చట్టం-1977 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్