అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గత్తుం పంచాయతీలోని గత్తుమ్ Gps ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కిల్లో భగవాన్, నేడు ఉదయం 10 గంటలకు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకొని, తమ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామని బోరున విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.