కొయ్యూరు మండలం రామరాజుపాలెం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కేడీపేట నుంచి చింతపల్లి వైపు వెళ్తున్న రెండు బైక్‌లను, చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆగకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు.