జీకే వీధి మండలం దారకొండ గ్రామంలో 8 ఏళ్ల బాలికపై పాస్టర్ దంపతులు రూ. 10 వేల నగదు చోరీ ఆరోపణలతో చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అట్లకర్రతో వాతలు పెట్టి దాడి చేశారని, గాయపడిన బాలికకు దారకొండ పీహెచ్‌సీలో చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.