
వల్లభాయ్ పటేల్ జయంతి: కోటవురట్లలో ఐక్యతా ప్రతిజ్ఞ, రన్ ఫర్ యూనిటీ
శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, శుక్రవారం కోటవురట్లలో స్థానిక ఎస్సై రమేష్ తన సిబ్బందితో కలిసి రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను ఘనంగా నిర్వహించారు. కోటవురట్ల హై స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులతో దేశ ఐక్యత కోసం ప్రతిజ్ఞ చేయించి, అనంతరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని చేపట్టారు. పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైటర్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది, పిడి గణేష్, పిఈటి బాబు పాల్గొన్నారు.




































