కోటవురట్ల మండల సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. సోమవారం ఎంపీపీ అప్పలనాయుడు అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పందూరు సర్పంచ్ జగదీశ్ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల పరిశీలనకు వచ్చిన సిబ్బంది సంబంధిత సర్పంచ్కు సమాచారం ఇవ్వకుండా టీడీపీ బ్రోకర్స్ తో పర్యటించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కోడవటిపూడి ఎంపీటీసీ ఎలమంచిలి ప్రకాశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ బ్రోకర్లు అనడం సరికాదన్నారు.