పాయకరావుపేటలో సీఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

5చూసినవారు
పాయకరావుపేటలో సీఐ వినోద్ బాబు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు
పాయకరావుపేట పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) వి. వినోద్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టారు. మెయిన్ రోడ్డు పరిధిలో పోలీస్ సిబ్బందితో కలిసి సీఐ 'విజిబుల్ పోలీసింగ్' మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విధులను పర్యవేక్షించారు. హెల్మెట్ ధరించని, సరైన ధ్రువపత్రాలు లేని వాహనదారులపై చలానాలు విధించారు. సీఐ వి. వినోద్ బాబు మాట్లాడుతూ, "హెల్మెట్ ధరించడం కుటుంబ భద్రతకు రక్షణ కవచం. ట్రాఫిక్ నిబంధనలను బాధ్యతాయుతంగా పాటించాలి. మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మితిమీరిన వేగంపై కఠిన చర్యలు తప్పవు" అని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్