ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం,
జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్ రాయవారం మండలం యువనాయకులు, యూత్ ప్రెసిడెంట్ లింగంపల్లి జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో పెనోగోళ్లు ప్రభుత్వ ఆసుపత్రి (PHC) లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పరాపల్లి అధ్యక్షులు తేటకాలి అరవింద్, గోకులపాడు
జనసేన నాయకులు మాలేం రాజు, పెనుగొళ్ళు గ్రామ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.