
సీఎం సహాయ నిధి చెక్కును అందజేసిన నేతలు
పెందుర్తి నియోజకవర్గంలోని పెదనరవలో నివాసం ఉంటున్న ఒమ్మి శివశంకర్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 36,451 రూపాయల చెక్కును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జి, 88వ వార్డు కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు చేతుల మీదుగా సోమవారం ఒమ్మి శివశంకర్ ఇంటి వద్ద అందజేశారు.






































