పెందుర్తి - Cuddalore

హిందూ చైతన్య వేదిక: మత మార్పిడులపై రాజేష్ హెచ్చరిక

హిందూ చైతన్య వేదిక: మత మార్పిడులపై రాజేష్ హెచ్చరిక

పాయకరావుపేట మండలం పాల్తేరులో సోమవారం హైందవ ధర్మ యజ్నం ఆధ్వర్యంలో జరిగిన హిందూ చైతన్య వేదిక కార్యక్రమంలో, అధ్యక్షులు రాజేష్ సనాతన ధర్మం గొప్పతనాన్ని వివరిస్తూ, ప్రలోభాలకు లొంగి మత మార్పిడి చేసుకుంటే కుటుంబాలలో కలహాలు చెలరేగుతాయని హెచ్చరించారు. ప్రభుత్వ రికార్డుల్లో హిందువులుగా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేయడానికి ఆర్టికల్ 25 సమర్ధించదని, అనుమతులు లేకుండా నిర్మించిన చర్చిలను తొలగించాలని ఆయన కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ప్రకారం మత మార్పిడి అయినవారికి ఎస్సీ హోదా పోతుందని, అలా కొనసాగితే మూడేళ్ల జైలు శిక్ష పడేలా చట్టం 16/1993 ఉందని, దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి దళిత సోదరులకు న్యాయం చేయాలని రాజేష్ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

వీడియోలు


హైదరాబాద్