
పెందుర్తి: 'టీడీపీ నుంచి ఇద్దరు నాయకుల సస్పెన్షన్'
పెందుర్తి మండలం చింతగట్ల గ్రామపంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కనిశెట్టి కనకరాజు, దమ్ము రమేశ్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ నిబంధనలను అనుసరించి పరిశీలన అనంతరం వీరిని సస్పెండ్ చేసి అధిష్టానానికి నివేదిక పంపినట్లు తెలిపారు.






































