
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే
గోపాలపట్నం, పెందుర్తి పరిధిలో ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అక్కడి పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంవీ చట్టం ప్రకారం కఠిన జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వాహనదారుల భద్రత కోసమే ఈ చర్యలని చెబుతూ, విరాట్ నగర్ వద్ద సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.





































