
విశాఖ: సింహగిరిపై చందన దీక్షల విరమణ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి సన్నిధిలో సోమవారం మండల, చందన దీక్షల విరమణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు 'నరసింహ' నామస్మరణతో ఇరుముడి సమర్పించి దీక్షలు విరమించారు. ఈఓ సుజాత ఆదేశాల మేరకు భక్తులకు అంతరాలయ దర్శనం, ఉచిత బస్సులు మరియు అన్నప్రసాద వితరణ వంటి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు పర్యవేక్షించిన ఈ వేడుకతో సింహగిరి భక్తితన్మయత్వంలో మునిగిపోయింది.
































