
జడ్డంగి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు ఘన సన్మానం
రాజవొమ్మంగి మండలం జడ్డంగి జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గుమ్మడి సూర్యనారాయణ (జిల్లా స్థాయి), చోడి శ్రీనివాస్ (మండల స్థాయి) ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న సందర్భంగా సోమవారం పాఠశాలలో ఘనంగా సన్మానించారు. హెచ్ఎం ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ అడపా మల్లేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.








































