రాజవొమ్మంగి మండలం గొబ్బిలమడుగు గ్రామంలో బుధవారం 104 ప్రభుత్వ సంచార వైద్య శిబిరం నిర్వహించారు. డా. శరత్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 30 మంది రోగులకు ఎం. ఎల్. హెచ్. పి. సుష్మ వైద్య
పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రాజబాబు, 104 డి. ఇ. ఓ. శ్రీనివాస్, పైలట్ శివకనకరాజు, ఆశలు చిన్నారి, వెంకటలక్ష్మి, దేవి పాల్గొన్నారు.