వై. రామవరం మండలం జంగాల తోటలో కుండపోత వర్షంలో పురిటినొప్పులతో బాధపడుతున్న నైనీ సంజనకు 108 సిబ్బంది సురక్షితంగా ప్రసవం చేశారు. అడ్డతీగల నుండి బయలుదేరి 36కి. మీ. ప్రయాణంలో మార్గమధ్యలో చెట్టు పడిపోవడంతో వాహనం వెళ్లలేని పరిస్థితుల్లో EMT ఏ. అశోక్, పైలట్ కె. ప్రసాద్ చెట్టును తొలగించి బుధవారం ఉదయం 4 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. అనంతరం అక్కడే ప్రసవం చేయగా ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డలను వై. రామవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అడ్డతీగల 108 సిబ్బంది సేవలను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.