అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం ఆర్. కె. రెసిడెన్సీలో శనివారం
జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబు గ్రామ, మండల, పార్లమెంట్ స్థాయిల్లో వివిధ విభాగాల కోసం పార్టీ శ్రేణులు సమర్పించిన దరఖాస్తులను స్వీకరించారు. పంచాయితీలకు 67, మండలాలకు 67, పార్లమెంట్ పరిధిలో 13 అర్జీలు అందాయి. మీడియా ప్రతినిధులు కూడా కొందరు దరఖాస్తులు సమర్పించారు. అర్హులైన వారి ఎంపిక పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని నాగేంద్రబాబు తెలిపారు. కూటమి కలిసి ఉన్నంతకాలం
జనసేన కలిసి పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.