రంపచోడవరంలో వాల్మీకి నగర్ శివాలయం వీధిలో నివాసముంటున్న చింతలయ్య అనే వ్యక్తి బుధవారం మద్యం మత్తులో ఉన్నప్పుడు, సహజీవనం చేస్తున్న మరియమ్మ మందలించడంతో తీవ్ర మనస్థాపనానికి గురై వరండాలో నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై రమేష్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.