విహారయాత్రకు వచ్చి నీటిలో కొట్టుకుపోయిన యువకుడు

1240చూసినవారు
విహారయాత్రకు వచ్చి నీటిలో కొట్టుకుపోయిన యువకుడు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొలమూరు గ్రామానికి చెందిన బుంగా బాల వందన్ 16 మంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు చింతూరు మండలం, చదలవాడ పంచాయతీ పరిధిలోని తులసిపాక గ్రామ సమీపంలో ఉన్న సోకులేరు వ్యూ పాయింట్‌కు వచ్చారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన బాల వందన్ అధిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్