జడ్డంగిలో జాతీయ రహదారిపై గేదె అడ్డురావడంతో ప్రమాదం

3చూసినవారు
జడ్డంగిలో జాతీయ రహదారిపై గేదె అడ్డురావడంతో ప్రమాదం
రాజవొమ్మంగి మండలం జడ్డంగి శివాలయ సమీపంలో 516 ఈ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి మోటార్ బైక్ కు గేదె అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం శంకాడ పంచాయితీ గోవాడ గ్రామానికి చెందిన జుర్రా చిన్నబ్బాయి తలకు, చేతులు, కాళ్ళుకు గాయాలు కాగా జడ్డంగి పి. హెచ్. సి లో స్టాఫ్ నర్స్ సత్యవేణి ప్రాథమిక చికిత్స చేశారు. తలభాగంలో కుట్లు వేశారు. రంపచోడవరం నుండి కుమారుడుతో కలిసి తిరిగి స్వగ్రామం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్