వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించడం పట్ల రాజవొమ్మంగి మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ గురువారం హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పుడు అర్హులైన కార్యకర్తలకు రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే నిర్ణయం అభినందనీయమన్నారు. పార్టీ కార్యకర్తలకు ఇది భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.