ఆలయ మార్గంలో మద్యం పార్టీలతో భక్తులకుతప్పని ఇబ్బందులు

2చూసినవారు
ఆలయ మార్గంలో మద్యం పార్టీలతో భక్తులకుతప్పని ఇబ్బందులు
రంపచోడవరం పరిధిలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలోని వందేళ్ల చరిత్ర గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంభికా మల్లిఖార్జునస్వామి ఆలయానికి వెళ్లే రహదారి ప్రాంతంలో మద్యం ప్రియులు పార్టీలు చేసుకుని, రోడ్డుపై ప్లేట్లు, వాటర్ బాటిళ్లు, వ్యర్థాలు వదిలేస్తున్నారు. దీంతో రహదారి అపరిశుభ్రంగా మారి, దైవ దర్శనానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఆలయ మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్