అల్లూరి: ఇక్కడి పిల్లలు చదవాలి అంటే 2 కిలోమీటర్ లు నడవాల్సిందే

889చూసినవారు
జీకే వీధి మండలంలోని లక్కవరపుపేట పంచాయతీ పరిధిలోని పోతురాజుగుమ్మల గ్రామ గిరిజనులు పాఠశాల భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో 20 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, శాశ్వత భవనం లేకపోవడంతో వారు 2 కిలోమీటర్ల దూరంలోని కొయ్యూరు మండలం కిండంగి ఎంపీపీ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు వెంటనే పాఠశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.