అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం మొండిగెడ్డ గ్రామంలో సోమవారం ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఎర్రజెర్రిపోతుగా పిలిచే పామును ఒక నాగుపాము మింగడాన్ని స్థానికులు చూశారు. ఈ దృశ్యం చూసి భయాందోళనకు గురైన గ్రామస్తులు ఆ రెండు పాములను చంపేశారు. సాధారణంగా పాములు తమ గుడ్లను తామే తింటాయని విన్నాం కానీ, ఒక పామును మరో పాము ఆహారంగా తీసుకోవడం చాలా అరుదు.