19 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు చేసుకోండి

580చూసినవారు
19 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు చేసుకోండి
పోలవరం జిల్లాలోని గుర్తేడు, పెదగెద్దాడ, నరసాపురం, జెడ్డంగి, రాజవొమ్మంగి, మారేడుమిల్లి, బొదులూరు, ఇందుకూరుపేట, ఎల్లవరం, నెల్లిపాక, తులసిపాకలు, ఏడుగురాళ్లపల్లి పీహెచ్‌సీల పరిధిలో 19 ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ పి. సరిత తెలిపారు. 25–45 ఏళ్ల వయస్సు, పదో తరగతి ఉత్తీర్ణులైన సంబంధిత గ్రామ మహిళలు అర్హులు. ఈ నెల 25లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. 30న ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్