వైసీపీ నేతపై దాడి.. ముగ్గురు అరెస్టు

44చూసినవారు
వైసీపీ నేతపై దాడి.. ముగ్గురు అరెస్టు
వైసీపీ జిల్లా నేత వెంకటేష్ రాజుపై దాడి చేసిన ముగ్గురు నిందితులను శుక్రవారం రాజవొమ్మంగి పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన అఖిల్ బాబు, జోహిరామ్స్, వెంకటేష్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.