రాజవొమ్మంగి జడ్పీ పాఠశాల చైర్మన్ గా బొండపల్లి శ్రీనివాస్,

0చూసినవారు
రాజవొమ్మంగి జడ్పీ పాఠశాల చైర్మన్ గా బొండపల్లి శ్రీనివాస్,
రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన విద్యాకమిటీ ఎన్నికలు చాలా ఉత్కంఠంగా సాగింది. చైర్మన్ గా బొండపల్లి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భారంగి దుర్గా భవాని లు ఎంపిక అయ్యారు. విద్యాకమిటీ మెంబర్లు ఎంపిక కూడా  ప్రశాంతంగా జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ చేత యం. ఇ. ఓ. కె. వి. వి. సత్యనారాయణదొర ప్రమాణం చేయించి ఎంపిక ధ్రువీకరణ పత్రాలను అందించారు. సి. ఐ. సన్యాసినాయుడు, ఎస్. ఐ. వెంకట్రావు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు విధులను నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్ లను మండల టిడిపి అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్