మారేడుమిల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలిక ఉన్నత పాఠశాల నుండి ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అదృశ్యమైనట్లు మారేడుమిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చావడి కోట పంచాయతీ చావడకోట గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మారేడుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి గోపి నరేంద్ర ప్రసాద్ ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని అదృశ్యంపై ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు.