చింతపల్లి మండలంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జి.మాడుగులు నుంచి లంబసింగి ఘాట్ రోడ్డు దిశగా వెళ్తున్న వాహనం బోడకొండమ్మ గుడి మలుపు వద్ద అదుపు కోల్పోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌ను పిలిచి ఆయనను నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.