రెండు గిరిజన పాఠశాలల మధ్యాహ్న భోజన సరుకుల సరఫరాలో జాప్యం

1674చూసినవారు
రెండు గిరిజన పాఠశాలల మధ్యాహ్న భోజన సరుకుల సరఫరాలో జాప్యం
రాజవొమ్మంగి మండలం వాతంగి, లోదొడ్డి గిరిజన ప్రాథమిక పాఠశాలలకు ఆగస్టు 10లోపు అందాల్సిన మధ్యాహ్న భోజన బియ్యం, బెల్లం, రాగి పౌడర్ సెప్టెంబర్ 22 వరకు చేరలేదు. వాతంగి పాఠశాలలో 64 మంది విద్యార్థులకు 135 కిలోలు, లోదొడ్డిలో 37 మందికి 85 కిలోల బియ్యంతో పాటు ఇతర సరుకులు జడ్డంగి గోడౌన్ నుంచి సరఫరా కావాల్సి ఉంది. ఈవిషయంపై ఎంఈఓ టి. సూరయ్యరెడ్డిని ప్రశ్నించగా, జడ్డంగి గోడౌన్‌కు బదులు రంపచోడవరం గోడౌన్ ట్యాగ్ కావడంతో జాప్యం జరిగిందని తెలిపారు. దాదాపు 40 రోజుల తర్వాత ప్రైవేటు వాహనం ద్వారా సరుకులు పాఠశాలలకు చేరాయని చెప్పారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రికార్డులు పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగు లోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్