మారేడుమిల్లి టూరిస్ట్ బంగ్లా కూల్చివేత: మాజీ ఎంపీటీసీ ఆవేదన

177చూసినవారు
రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి గ్రామంలోని పురాతన జిల్లా పరిషత్ టూరిస్ట్ బంగ్లాను అధికారులు కూల్చివేశారు. గత కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాన్ని తొలగించి, కొత్త నిర్మాణాలు చేపడతామని ఐటీడీఏ అధికారులు తెలిపారు. అయితే, పెంకులు, ఫర్నిచర్ ఉండగానే బంగ్లాను కూల్చివేయడంపై మారేడుమిల్లి మాజీ ఎంపీటీసీ, ఆర్టీఐ నియోజకవర్గ అధ్యక్షుడు గొర్లె అనిల్ ప్రసాద్ (బాబీ) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బంగ్లా గతంలో అధికారులు, రాజకీయ ప్రతినిధులకు నిలయంగా ఉండేది.