దేవీపట్నం: గోదావరి వరద నుంచి బయటపడిన ఆలయం

192చూసినవారు
దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరద నీటి నుంచి బయటపడిందని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ శనివారం తెలిపారు. కొద్దిరోజుల క్రితం వరకు ఆలయం వరదలో మునిగిపోయి ఉండేది. ఇప్పుడు నీటిమట్టం తగ్గడంతో ఆలయం బయటకు కనిపిస్తోంది. ఆలయాన్ని శుభ్రం చేసినట్లు ఈవో తెలిపారు. అయితే, అప్పుడే భక్తులు దర్శనానికి రావద్దని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్