రాజవొమ్మంగి మండలం నుండి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతీ శనివారం దర్శనానికి వెళ్లే భక్తులు సంఖ్య పెరుగుతుంది. ఏడు శనివారాలతో పాటు అఖరి ఎనిమిదో శనివారం దర్శనంతో మొక్కులు తీరుతాయి. విశేష మహిమలు గల వెంకటేశ్వరస్వామి దర్శనానికి జడ్డంగి, అమీనాబాద్ కాలనీ నుండి శనివారం 20 మంది మహిళలు తరలివెళ్లారు. 200 కి. మీ. ప్రయాణమని రాజవొమ్మంగి నుండి ఉదయం 5 గంటలు బస్సు ఆపకపోవడంతో ప్రవేటు ఆటోలో ఏలేశ్వరం వెళ్లారు. అక్కడ నుండి బస్సు ప్రయాణంలో 12 గంటలకు ఆలయానికి చేరుకొంటారు.