జడ్డంగి పోలింగ్ బూత్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

1027చూసినవారు
జడ్డంగి పోలింగ్ బూత్‌లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
రాజవొమ్మంగి మండలం జడ్డంగి గిరిజన సంక్షేమ బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో స్థానిక ఎన్నికల పోలింగ్ బూత్ లను పోలవరం జిల్లా ఎస్పీ చక్రవర్తి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్రాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. జడ్డంగి పోలీస్ స్టేషన్ ను కూడా తనిఖీ చేసి, భద్రతా ఏర్పాట్లను, రికార్డులను, కేసుల పురోగతిని సమీక్షించారు. ఆపరేషన్ త్రిసూల్ లక్ష్యమని తెలిపారు. ఈ తనిఖీలో సి. ఐ. సన్యాసినాయుడు, ఎస్. ఐ. చినబాబు, ఏ. ఎస్. ఐ సురేష్, శాస్త్రి, సుబ్బారావు, ప్రసాద్ రెడ్డి, శ్రీను, సురేష్, లింగేశ్వరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్