ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు - పోలవరం ఎస్పీ చక్రవర్తి

2చూసినవారు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు - పోలవరం ఎస్పీ చక్రవర్తి
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలవరం జిల్లా ఎస్పీ కే. చక్రవర్తి ఐపీఎస్ బుధవారం అడ్డతీగల, వై. రామవరం, గంగవరం మండలాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బ్యాలెట్ బాక్సుల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, సీసీటీవీ ఫుటేజ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. డీఎస్పీ అష్రఫ్ అలీ, ఎస్బీ సీఐ భాను ప్రసాద్, సీఐ ఎం. గజేంద్ర కుమార్, ఎస్ఐ కే. పార్థసారథి, ఎస్ఐ బి. వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్