మారెడుమిల్లి మండల ప్రజలు కొండావాగులు, ప్రవహించే కాలువలు దాటవద్దని ఆర్టిఐ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ గొర్లె అనిల్ ప్రసాద్ (బాబీ) పిలుపునిచ్చారు. అత్యవసర పనులుంటేనే బయటకు రావాలని, ముఖ్యంగా విద్యుత్ స్తంబాలు, స్విచ్చులు తడి చేతులతో ముట్టుకోవద్దని, శిథిల గృహాల వద్ద ఉండవద్దని ఆయన ప్రజలకు సూచనలు జారీ చేశారు.