అడ్డతీగల సాయి సన్నిధి ఫంక్షన్‌హాల్‌లో శనివారం NALSA ఆధ్వర్యంలో న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. గిరిజనులు తమ హక్కులను తెలుసుకుని పొందడంతో పాటు చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. అర్హులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్, ఓఎస్‌డీ ఎం. జవాలి అల్ఫోన్స్ ఐపీఎస్, JFCM మురళీ గంగాధరరావు పాల్గొన్నారు.