దోనేలపాలెం పాఠశాల కమిటీ ఎన్నికలు: శివమహేశ్వరి చైర్మన్‌గా ఏకగ్రీవం

4చూసినవారు
దోనేలపాలెం పాఠశాల కమిటీ ఎన్నికలు: శివమహేశ్వరి చైర్మన్‌గా ఏకగ్రీవం
రాజవొమ్మంగి మండలం దోనేలపాలెం మండల ప్రజాపరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యాకమిటీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో గోము శివమహేశ్వరి నూతన పాఠశాల చైర్మన్‌గా, రుత్తల రాజేశ్వరి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 10 మంది సభ్యులు కూడా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె. రాంబాబు, ఉపాధ్యాయులు జి. శ్రీను, సి. హెచ్. రామకృష్ణ, కె. రమేష్ బాబు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్